WhatsApp Image 2024 09 19 at 17.32.02
CP inspected the Bandobast arrangements during the Milad Un Nabi rally
ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలని మత పెద్దలకు సూచన పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మిలాద్-ఉన్-నబి ర్యాలీ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండము పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,ఐజి తెలిపారు.
ఈరోజు పెద్దపల్లి పట్టణం లో సీపీ సందర్శించి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లు ను పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్.ఇతర పోలీస్ అధికారులతో కలిసి సీపీ పరిశీలించి ప్రశాంతమైన వాతావరణం లో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. రెండు రోజుల కిందట శాంతియుత వాతావరణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గణేశ్ నిమజ్జనం కార్యక్రమంలో పోలీసులు సక్సెస్ అయ్యారని, అదే స్ఫూర్తితో మిలాద్-ఉన్-నబీ ర్యాలీలను కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరుపున అన్ని ఏర్పాట్లు చేసి ర్యాలీలు నిర్వహించే నిర్వాహకులతో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ర్యాలీ తీసే మార్గాలను ముందుగానే తెలుసుకొని, ఆ మార్గాల్లో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్త్ ఏర్పాటు జరిగింది అన్నారు.
సిపి వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, పెద్దపెల్లి ఏ సి పి జి కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “Milad Un Nabi Rally : మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ”
Comments are closed.