నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..రైతు భరోసాపై కీలక ప్రకటన..!!
Trinethram News : Telangana : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన.. ఇవాళ మధ్యాహ్నం… నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. దీంతో రైతు భరోసాపై ఏ౦ తేలుస్తారో
అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. నేడు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
డిక్లరేషన్ ఇవ్వాలనే సర్కార్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో కేబినెట్ నిర్ణయం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాతో పాటు మరిన్ని అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ ఉంటుంది. కొత్త ఇంధన పాలసీ పై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App