కేరళ (శబరిమల)..
బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది…
పూజ అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు..
మకరవిలక్కు పూజల కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. నేడు చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా భక్తుల రద్దీ ఉంది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది..
జనవరి 15న మకరవిలక్కు పూజ నిర్వహించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు..