టీబీజీకేఎస్ సింగరేణి గని ఎన్నికల్లో గయాబ్
ఇల్లందు డిసెంబర్ 29:
తెలంగాణలోని సింగరేణి ఎన్నికల్లో పోటీపై పూటకో మాట మాట్లాడడం కొంప ముంచిందా.
పోటీలో ఉండట్లేదని ప్రకటించిన మరుసటి రోజే పోటీలో ఉంటామని చెప్పడం సంఘం నేతల గందరగోళానికి కారణ మైందా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దిశా నిర్దేశం పనిచేయలేదా.
అసెంబ్లీ ఓటమి ఎఫెక్ట్ సింగరేణి ఎన్నికలపై పడిందా హామీలు ఇచ్చినా కార్మికుల్లో నమ్మకం కలిగిం చలేకపోయారా ఇన్ని ప్రతి కూల అంశాల మధ్య బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ 9 డివిజన్లలో డిపాజిట్లు కోల్పోయింది.
పార్టీ నేతల స్వయంకృ తాపరాధం యూనియన్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. ఒక్క డివిజన్ లోనూ విజయం సాధించ లేక చతికిలపడింది ఈ ఘోరపరాజయంతో గులాబీ నేతల్లో మరింత నైరాశ్యం నెలకొంది.
విశ్వసించని కార్మికులు.
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ అనూహ్య రీతిలో కనుమ రుగైంది ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
సింగ రేణిలోని నాలుగు డివిజన్లలో 11 ఏరియాలు ఉన్నాయి వాటికి ఎన్నికలు నిర్వహించగా టీబీజీకే ఎస్‌తో పాటు మరో 12 కార్మికసంఘాలు పోటీ చేశాయి.
కానీ ఒక్క ఏరియాలోనూ సత్తా చాటలేకపోయింది. టీబీజీకేఎస్‌కు ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలి గా కొనసాగుతున్నారు సంఘం నాయకులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
సింగరేణి ఏరియాల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచు కోకపోవడంతో ప్రచారానికి గులాబీ నేతలు దూరంగా ఉన్నారు.
కార్మిక సంఘం నాయకులకే పూర్తి బాధ్యతను అప్పగిం చారు. టీబీజీకేఎస్ హామీల ను కార్మికులు విశ్వసించ లేదు. మణుగూరులో 728 ఓట్లు, శ్రీరాంపూర్‌లో 216 ఓట్లు వచ్చాయి.
ఈ రెండు ఏరియాల్లో మాత్రమే డిజిపాట్లను దక్కించుకుంది. మిగిలిన 9 ఏరియాల్లో డబుల్ డిజిట్‌కే పరిమితం అయింది. ఇల్లం దులో ఒకే ఒక్క ఓటు రాగా, బెల్లంపల్లిలో 3 ఓట్లు వచ్చాయి.
కొత్తగూడెం కార్పొరేట్‌లో 33 ఓట్లు, కొత్తగూడెంలో 36 ఓట్లు, రామగుండం-1 లో 37ఓట్లు, రామగుండం-2 లో 47 ఓట్లు, రామగుండం-3 లో 59 ఓట్లు, భూపాలపల్లి లో 57 ఓట్లు, మందమర్రిలో 81 ఓట్లు మాత్రమే వచ్చాయి.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బాధ్యతను కవిత తీసుకున్నప్పటికీ ఘోరపరా జయం పాలవడంతో సంఘం ఉనికి ప్రమాదంలో పడింది.