సైదాపేట : నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేశానని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణా, పుదుచ్చేరి గవర్నర్ పదవులకు రాజీనామా లేఖ రాష్ట్రపతికి పంపిన తమిళిసై మంగళవారం చెన్నై చేరుకున్నారు. ఆమె విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించేందుకే పదవికి రాజీనామా చేశానని అన్నారు. తెలంగాణా, పుదుచ్చేరి ప్రజల ఆప్యాయతకు రుణపడి ఉంటానన్నారు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ప్రజల మధ్య ప్రత్యక్షంగా పని చేయటమే ఇష్టమని పేర్కొన్నారు. గవర్నర్ పదవితో చాలా అనుభవం దక్కిందన్నారు. నాలుగున్నరేళ్లలో ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు ఎన్నికలు, గవర్నర్ బాధ్యతుల కూడా నిర్వర్తించానని తెలిపారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొని అభినందనలు అందుకున్నానని చెప్పారు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చానంటే ఎందుకనేది ప్రజలు అర్ధం చేసుకోవాలని తెలిపారు.
నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేశానని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు
Related Posts
Murder Case : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు
TRINETHRAM NEWS కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు..!! Trinethram News : కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై (Kolkata Doctor Case) హత్యాచార…
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు
TRINETHRAM NEWS గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు Trinethram News : న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల (Delhi election) కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు…