Trinethram News : తమిళనాడు:మార్చి 30
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఇప్ప టికే చాలామంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు.
అయితే తాజాగా ఈరోజు ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు.
వెట్ట యాడు విలయాడు, వడా చెన్నై లాంటి సినిమా లలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ సినిమాలలో విలన్ గా పని చేశారు.
బాలాజీ. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశారు. తమిళ పరిశ్ర మకు చెందిన ప్రముఖులు అలాగే అభిమానులు బాలాజీకి నివాళులు అర్పిస్తున్నారు….