
బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మందమర్రి మున్సిపల్ పరిధిలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో రోడ్లు కాలువలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్
తుంగ పిండి రాజలింగు బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ బృందం వినతి పత్రం సమర్పించింది
అనంతరం ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మందమర్రి మార్కెట్ ప్రాంతంలో బడ వ్యాపారస్తులు రోడ్లు కాలువలను ఖాళీ స్థలాలను ఆక్రమిస్తూ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని మున్సిపల్ చట్టాలంటే వీరికి లెక్క లేదని ముల్కల్ల రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు నిబంధనలు అతిక్రమించిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరమన్నారు మున్సిపల్ కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారని ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ మార్కెట్ ప్రాంత అభివృద్ధికై పలు సూచనలు చేశారు
1)రామకృష్ణ మెడికల్ షాప్ నుండి అజయ్ క్లాస్ స్టోర్ క్రింది వరకు గల పాత కాలువపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి కాలువను పునర్నిర్మాణం చెయ్యాలి
2) అన్ని షాపుల ముందు గల కాలువను ఆక్రమించడం వల్ల వర్షపు నీరు పోకుండా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలి
3) స్టేట్ బ్యాంక్ ముందు గల కాళీ స్థలంలో ప్రజల సౌకర్యార్థం గ్రంథాలయాన్ని నిర్మించాలి
4) కూరగాయల మార్కెట్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి ముందుకు జరిపి నిర్మాణాలు చేసినందు వల్ల రద్దీ ఏర్పడి వినియోగదారులకు ఇబ్బంది కలుగుతున్నందున రోడ్డును వెడల్పు చేసి రద్దీని నివారించగలరు
5) గంప శంకరయ్య Gమార్ట్ వారు మరియు రాజయోగి షాపింగ్ మాల్ ప్రక్కన ప్రజల సౌకర్యార్థం విశాలమైన రోడ్లు ఉండేవి వాటిని ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మాణాలు చేసినారు వాటిని వెంటనే తొలగించగలరు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఎస్ పి నాయకులు గాజుల శంకర్, ఎండి మతిన్ ఖాన్ , బొర్లకుంట రాయలింగు తదితరులు.పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
