TRINETHRAM NEWS

సుప్రీం కోర్టు తీర్పు

మొదటి భర్తతో విడాకులు పొందకున్నా.. భరణానికి భార్య అర్హురాలే

Trinethram News : న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 : తన మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కానప్పటికీ భార్య తన రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు కలిగి ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోనప్పటికీ, అతని నుంచి వేరుగా ఉంటూ రెండో వివాహం చేసుకున్న భర్త నుంచి సెక్షన్‌ 125 క్రిమినల్‌ ప్రొసీజర్‌ ప్రకారం పరిహారాన్ని పొందవచ్చునని జస్టిస్‌ బీవీ నాగరత్న, సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తెలిపింది. మొదటి భర్తతో విడాకులు పొందనందున ఆమెకు రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు ఉండదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు బాధితురాలికి అనుకూలంగా తీర్పు చెప్పింది.

125 క్రిమినల్‌ ప్రొసీజర్‌ ప్రకారం భరణ హక్కు భార్య పొందే ప్రయోజనం కాదని భర్త వహించాల్సిన నైతికపరమైన, చట్టపరమైన విధి అని గుర్తుంచుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఒక మహిళకు పెండ్లయ్యి ఒక పిల్లాడు సంతానం. అయితే భర్తతో విభేదాల కారణంగా ఆమె అతడితో విడిపోయి, మరో వ్యక్తిని రెండో పెండ్లి చేసుకుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court Judgment