TRINETHRAM NEWS

నారా లోకేష్ ను కలిసిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు

(13-12-2023):
• పాయకరావుపేట నియోజకవర్గం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• ఆసియా ఖండం సహకార రంగంలో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ ఏటికొప్పాకలో 1932-33లో ఏర్పాటుచేశారు.
• 20మంది సభ్యులతో మొదలైన ఫ్యాక్టరీ 2004 నాటికి 5,600మంది సభ్యులు అయ్యేంతలా అభివృద్ధి చెందింది.
• ప్రారంభ దశలో 70 టన్నుల క్రషింగ్ తో మొదలైన ఫ్యాక్టరీ 2004 నాటికి 2.84లక్షల టన్నులకు పెరిగింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది.
• రైతులకు ప్రోత్సాహకాలు క్రమక్రమంగా తగ్గడం వల్ల చెరకు ఉత్పత్తి తగ్గిపోయింది.
• చంద్రబాబు పాలనలో ఈ ఫ్యాక్టరీకి రూ.27కోట్లు అందించారు.
• చైర్మన్ వ్యవస్థ వచ్చేసరికి ఫ్యాక్టరీ లాభాలను తినేసి, నష్టాలను మాత్రమే లెక్కలు చూపించడం ప్రారంభించారు.
• దీనివల్ల 16నెలలు కార్మికులకు అందాల్సిన జీతభత్యాలు బకాయి పెట్టారు.
• 22-08-2018న జగన్ తన పాదయాత్ర సమయంలో ఫ్యాక్టరీ మెయిన్ గేటు వద్ద మమ్మల్ని, ఫ్యాక్టరీని ఆదుకుంటామని హామీ ఇచ్చి, ఆ తర్వాత గాలికొదిలేశారు.
• జగన్ తన నాలుగున్నరేళ్ల పాలనలో మాకు చేసింది శూన్యం.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని, కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం.
నారా లోకేష్ స్పందిస్తూ…
• మాటతప్పుడు, మడమ తిప్పుడుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి.
• ముఖ్యమంత్రి అయ్యాక షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తామని పాదయాత్రలో చెప్పిన జగన్ నేటికి ఒక్క ఫ్యాక్టరీని కూడా తెరిపించలేదు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక కొప్పాక సుగర్ ఫ్యాక్టరీ బకాయిలు విడుదల చేసి ఆదుకుంటాం.
• కొప్పాక సుగర్స్ కు మళ్లీ గతవైభవం తెస్తాం.