
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
హుకుంపేట ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ సంతోష్ ఉజ్వల్ వెల్లడి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 100% మంచి ఫలితాలు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ హుకుంపేట ఏకలవ్య ప్రిన్సిపల్ ఉజ్వల్ సంతోష్ ఆధ్వర్యంలో నేడు విద్యార్థులకు, తల్లిదండ్రుల సమక్షంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుకుంపేట, పాడేరు ఈఎమ్ఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు వాళ్ల భవిష్యత్తు పరిధిలో ఉంచుకొని, తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు 6 ,7,8 ,9 తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ ఆయా తరగతుల విద్యార్థులకు పై చదువుల నిమిత్తం ప్రమోట్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
మా స్కూళ్లలో 100% విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని మంచి మార్కులు సాధించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ దేవున్ని కోరుకుంటున్నానని, విద్యార్థులకు ఆయన ఆశీర్వదించారు.అలాగే గురువులతో పాటు విద్యార్థులపై చదువు విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, విద్యార్థులు ప్రభుత్వ సెలవులపై వెళ్లిన విద్యపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఉన్నతమైన చదువును అభ్యసిస్తారని, నేర్పుతారని ఆయన వెల్లడించారు.మా స్కూల్లో విద్యార్థులకు మంచి భవిష్యత్తుతో పాటు, మంచి రిజల్ట్ ఉంటుందని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో హుకుంపేట ఏకలవ్య ఈఎంఆర్ఎస్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ సంతోష్ ఉజ్వల్, విజయ్, అమిత్ కుమార్, ప్రియాంక ,సచిన్ ,అంకిత్ కుమార్ జయశ్రీ ,ఆస్ మహమ్మద్ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
