మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఎస్సై
గద్వాల పట్టణం: మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం గద్వాల పట్టణ కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రుతురాజ్ ఆదేశాల మేరకు వివిధ మండలాల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 24 మందికి గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ…మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదం జరిగి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కావున మద్యం తాగి వాహనాలు నడపద్దని హెచ్చరించారు.వాహన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారు. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని తెలిపారు. తాగి వాహనం నడపడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మద్యం మత్తులో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదన్నారు.పోలీసులు ఎప్పుడు పౌర సమాజానికి మంచి స్నేహితులని మంచి చేసిన వారికి అండగా ఉంటూ చెడు చేసిన వారికి కచ్చితంగా శిక్ష ఉంటుందన్నారు. 18 ఏళ్లు పైబడి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ సిబంది, వాహనదారులు పాల్గొన్నారు.