TRINETHRAM NEWS

Stop Diarrhea Campaign from 1st July to 31st August

స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ను విజయవంతంగా నిర్వహించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ

*చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యత విస్తృతంగా ప్రచారం చేయాలి

*స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

పెద్దపల్లి , జూలై -05: త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ను విజయవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ అన్నారు.

శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లాలో స్టాప్ డయేరియా నిర్వహణ ప్రణాళికను డి.ఎం.అండ్ హెచ్. ఓ డాక్టర్ కె. ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ కృపా బాయి*లు వివరించారు. జిల్లాలో 5 సంవత్సరాల లోపు ఉన్న 62,700 మంది పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని, ఇందు కోసం జిల్లాలో 93,600 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదే విధంగా డయేరియాతో బాధపడే వారికి జింక్ ట్యాబ్లెట్స్ అందించేందుకు గాను 13,300 జింక్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ, జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. రెగ్యులర్ గా చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల చాలా వరకు రోగాలను నివారించే అవకాశం ఉంటుందని, ఈ అంశాన్ని ప్రజలలో విస్తృతంగా తీసుకొని వెళ్లేలా ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను సూచించారు.

ప్రతి రోజు టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, ఇంటిని శుభ్రం చేసిన తర్వాత, వంట చేసే ముందు, ఆహారం తినే ముందు మనం చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతను చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థలలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా డయేరియా చికిత్స నిమిత్తం 5సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డయేరియాతో బాధపడే వారికి జింక్ ట్యాబ్లెట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా విస్తృతంగా డయేరియా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో 5 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల పెరుగుదలను పరిశీలించి డయేరియా కారణంగా పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందించాలని, అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న 5 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు ఓఆర్ఎస్, డయేరియాతో బాధపడే వారికి జింక్ ట్యాబ్లెట్స్ పంపిణీ చేయాలని, గత నాలుగు నెలల సమయంలో డయేరియాతో బాధపడిన 5 సంవత్సరాల వయసు లోపు పిల్లల జాబితా అందించాలని అన్నారు. ఆరు నెలల వయస్సు వచ్చేవరకు పిల్లలకు తల్లిపాలు అందించాలని గర్భిణీ స్త్రీలలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు.

వర్షాకాలంలో నీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లలకు కాచి, చల్లార్చిన నీళ్లు తాగించాలని తల్లులకు అవగాహన కల్పించాలని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించాలని, జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సెంటర్స్, పాఠశాలలు మొదలగు ప్రదేశాలలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, పట్టణాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా టాయిలెట్ వినియోగం, చేతులు కడుక్కోవడం, సురక్షిత మంచినీరు మాత్రమే త్రాగడం వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ , జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, మున్సిపల్ కమీషనర్లు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Stop Diarrhea Campaign from 1st July to 31st August