
Still wants to go to space: Raveesh Malhotra
Trinethram News : ఇంటర్నెట్‌డెస్క్: తనకు ఇప్పుడు అవకాశం వచ్చినా అంతరిక్ష యాత్రకు సిద్ధమని రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ రవీశ్ మల్హోత్ర పేర్కొన్నారు. త్వరలో నేషనల్ స్పేస్‌డే రానున్న సందర్భంగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వింగ్ కమాండర్ రాకేశ్ శర్మతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లేందుకు మల్హోత్ర కూడా శిక్షణ పొందిన విషయం తెలిసిందే.
‘‘ఇప్పుడు అవకాశం వచ్చినా అంతరిక్ష యాత్రకు సిద్ధమే. భారత్‌కు చెందిన గగనయాన్‌లో వెళ్లేందుకు ఇష్టపడతాను. అమెరికా సెనెటర్ 77 ఏళ్ల వయసులో వెళ్లారు. అలాంటప్పుడు నేను కూడా ప్రయాణించగలను’’ అని రవీశ్ వ్యాఖ్యానించారు.
1984 నాటి తన అనుభవాలను వెల్లడిస్తూ2 Full stop అంతరిక్ష యాత్ర అవకాశం కోల్పోవడం జీర్ణించుకోలేని విషయమని రవీశ్ వెల్లడించారు. అయితే శర్మ గాని, తను గాని ఎవరో ఒక్కరికే వెళ్లే అవకాశం ఉందన్న విషయం తెలుసన్నారు. బెంగళూరులోని ఇంటిపై నుంచి ఫైటర్ జెట్ సార్టీల శబ్ధాలను ఆస్వాదిస్తూ తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నట్లు చెప్పారు.
మన గగన్‌యాన్ పైలెట్లు వ్యోమగాములుగా అద్భుతంగా రాణిస్తారని రవీశ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇస్రో ఈ ప్రాజెక్టును విజయవంతం చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు ఎంపికైన నలుగురు పైలెట్లు ఆయనకు ముందే తెలుసు. వీరి ఎంపిక ప్రక్రియలో కూడా కీలకపాత్ర పోషించారు. గగన్‌యాన్ వ్యోమగాముల ఎంపిక బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఇదే సంస్థ రాకేశ్ శర్మ, రవీశ్ మల్హోత్రాను కూడా నాడు ఎంపిక చేసింది.
ఇటీవల గగన్‌యాన్‌కు మన పైలెట్లు శిక్షణ పొందేవరకు2 Full stop భారత్‌లో అంతరిక్ష యాత్రకు ట్రైనింగ్ పూర్తిచేసిన ఇద్దరు పైలెట్లలో రవీశ్ ఒకరు. వాయుసేన నుంచి పదవీవిరమణ చేసిన తర్వాత రవీశ్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
