State government is responsible for public welfare
రూ.1.73 కోట్లు కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులు పంపిణీ.
17 నుండి 2వ విడత ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ.
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి పట్టణం ఆర్యవైశ్య భవనంలో బుధవారం 173 మంది కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ లబ్ధిదారులకు రూ. 1,73,45,097 చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో నియోజకవర్గంలో పలు దఫాలుగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు.
ఈనెల 17న రెండో విడత ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుందని, గతంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పథకాలలో కొన్ని అందకపోవడంతో తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. 17 న అర్హులైన ప్రతి ఒక్కరి నుండి అధికారులే లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హులైన నిరు పేదలందరికీ రేషన్ కార్డు అందించే విధంగా కృషి చేస్తుందని అభయమిచ్చారు. సబ్బండ వర్గాల ప్రజలకు మేలు చేసేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ చేసే మంచి పనులను ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెరలేపాయని, వారికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ప్రజల కోసమే తాము పని చేస్తామని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్, నాయకులు నూగిల్ల మల్లయ్య, ఎడెల్లి శంకర్, బూతగడ్డ సంపత్, మస్రత్, ఈర్ల స్వరూప, నెత్తెట్ల కుమార్, కొమ్ము శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ పట్టణ కౌన్సిలర్లు, మండల మాజీ సర్పంచ్లు, ప్రజా ప్రతినిదులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు మరియు తదితరులు పాల్గొన్నారు