TRINETHRAM NEWS

మార్చి-01: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. టాస్క్ ద్వారా వివిధ కోర్సులు శిక్షణకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులు ఇటీవల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు ప్రారంభించిన టువంటి నైపుణ్యాభివృద్ధి కేంద్రం టాస్క్ ద్వారా వివిధ కోర్సులకు సంబంధించి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలిపారు
వెబ్ అప్లికేషన్స్, జావా ప్రోగ్రామింగ్, పైతాన్ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రాం సి ప్లస్ ప్రోగ్రామింగ్ టాటా ప్లస్ ప్రోగ్రామింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ ,టాలీ ,జిఎస్టి పై కోర్సులలో విద్యార్థులు ముఖ్యంగా ఇంజనీరింగ్ డిగ్రీ ఎంసీఏ పాలిటెక్నిక్ చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులు శిక్షణ తీసుకోవడానికి అర్హులని అన్నారు
శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ సెంటర్లోనే వివిధ బహుళ జాతి సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు జాబ్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుందని, ఇటీవల యాక్సిస్ బ్యాంక్ నిర్వహించిన జాబ్ మేళాలో మా సెంటర్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు భవాని రసజ్ఞ హేమంత్ లకు 2.4 లక్షల ప్యాకేజీ తో ఉద్యోగాలు లభించాయని టాస్క్ మేనేజర్ గంగ ప్రసాద్ తెలిపారు
ఔత్సాహికులైన నిరుద్యోగ విద్యార్థులు అందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, ఆసక్తి కల విద్యార్థులందరూ టాస్క్ కేంద్రానికి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరములకు పెద్దపల్లి ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో గల టాస్క్ ఆఫీసులో సంప్రదించగలరని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App