పీఎస్ఎల్వీ-సీ58 విజయంపై ఇస్రో చైర్మన్ ను అభినందించిన శ్రీసిటీ ఎండీ

TRINETHRAM NEWS

పీఎస్ఎల్వీ-సీ58 విజయంపై ఇస్రో చైర్మన్ ను అభినందించిన శ్రీసిటీ ఎండీ

♦️ – శ్రీసిటీని సందర్శించాలని ఆహ్వానం

🔹సోమవారం పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్, షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్, షార్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

🔹 ఈ అద్భుత ఘట్టాన్ని షార్ మిషన్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని వీక్షించిన ఆయన, అంతరిక్ష సాంకేతికతలో అగ్రగ్రామిగా భారతదేశం స్థానాన్ని సుస్థిరం చేస్తూ, ఈ విజయాన్ని అందించిన ఇస్రో బృందం కృషి, అంకితభావాన్ని కొనియాడారు.

🔹ఈ సందర్భంగా శ్రీసిటీ వేగవంతమైన ప్రగతిని వివరిస్తూ, తాజా అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసేందుకు మరియు ఇస్రోకు సహకరిస్తున్న పరిశ్రమల సీఈఓలతో సంభాషించడానికి శ్రీసిటీని సందర్శించాలంటూ డాక్టర్ సోమనాథ్‌ను రవీంద్ర సన్నారెడ్డి ఆహ్వానించారు.

You cannot copy content of this page

Scroll to Top