TRINETHRAM NEWS

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 24 – 01 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,

తిథి : చతుర్దశి రా9.32 వరకు,
నక్షత్రం : ఆర్ద్ర ఉ6.46 వరకు,
తదుపరి పునర్వసు,
యోగం : వైధృతి ఉ8.19 వరకు,
కరణం : గరజి ఉ9.14 వరకు,
తదుపరి వణిజ రా9.32 వరకు,

వర్జ్యం : రా7.26 – 9.08,
దుర్ముహూర్తము : ఉ11.50 – 12.34,
అమృతకాలం : తె5.34 నుండి,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండo : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.47,

           నేటి మాట

మానవ జీవిత పరమావధి ఏమిటి??
ఆత్మ నుండి వచ్చాను కనుక తిరిగి ఆత్మనేచేరాలి, అదే శాశ్వత ఆనందము, అని దానికి సంబంధించిన విచారణ చేయవలెను…
ఇదే జీవితము యొక్క పరమావధి అయి ఉండవలెను…
ఇవి తప్ప మిగిలినవన్నీ హుళక్కి విద్యలు మాత్రమే, తళుక్కున పోవునవే.
మంచిగా విచారించి, వెనక్కి తిరిగి చూచిన ఏమీ వుండదని, ఇదంతా మాయ అని మనకు తెలియును…

       ఒక రాజు ఉండేవాడు, రాజ్య భారమును తగు రీతిలో విచారింపక, అన్నీ మంత్రి పైనే వేసేవాడు. 

రాజు కు ఒక అంగరక్షకుడుండేవాడు, అతను ప్రతికార్యము, మంచి చెడ్డలు చర్చించి, ఎందుకు ఎట్లు? అని విచారణ చేసేవాడు.
అట్టి విచారణ అవసరం లేదని రాజు అతనిని , అవివేకి గా నిర్ణయించి, ఒక స్వర్ణ రేకుపై ‘ అవివేకి శిఖామణి ‘ అని నొసటి పై కట్టించాడు…

కొంతకాలానికి రాజు కు మరణ మాసన్నమై, దైవ చింతన తెలీక సదా మరణ చింతనతోనే, దుఃఖము న మునిగి నాడు…

అవివేకి శిఖామణి రాజు వద్దకు వచ్చి, మీరెక్కడికి పోవుచున్నారు? పల్లకీ, ఏనుగులు , గుఱ్ఱములను తీసుకు వెళ్ళాలా? ఎలా వెడతారు? అని రాజుతో ప్రశ్నలు కురిపించాడు.

రాజు నాకు ఎక్కడకెడతానో తెలీదని, ఈ రధ, గుఱ్ఱములు తీసుకు వెళ్ళాలేనని, ఎవరి కాలమాసన్నమైన వారే వెళ్ళాలని, ఎవరూ తోడు రారని, ఆస్థలమెక్కడో కూడా తెలీదని తన అసక్తతను వెల్లడిస్తాడు.

ఆ మాట వినగానే తన నొసట కట్టిన స్వర్ణ రేకును విప్పి, ఇప్పుడు ఈ అవివేక శిఖామణి బిరుదు మీకే సరిపోతుంది అని నిర్భయంగా రాజుకి ఇచ్చి వేసి వెళ్తాడు …

అపుడు రాజు చింతించి, తన ఉత్తమ కాలమంతా, ఎటువంటి దైవ చింతన చేయలేక పోతినే అని విచారించి, దైవ చింతనే ముఖ్య సాధన, అందరూ సర్వేశ్వర శక్తులను విచారణ చేయమని, కాలమును సార్ధకము చేసుకో వలెనని, తన రాజ్య ప్రజలకు తన సందేశమును బోధించి, తాను దైవ చింతన చేయలేక, కాలము సమీపించినదని, ఎంతో బాధపడి, విచారము తో ప్రాణము లు వదలెను…

కాన ప్రకృతి విద్యలు, అసత్య మని ధృడము చేసుకుని, ఏదినిత్యమో, ఏదసత్యమో, యోచింపవలెను, అప్పుడే మానవ జన్మకు సార్థకత…
మనం జన్మరాహిత్యం చెందాలి అంటే ఏది ముఖ్యమో అది తెలుసుకోవాలి …
ఈరోజుల్లో మనం అన్నం కోసం పాకులాడుతున్నాము కానీ ఆత్మ కోసం పాకులాడడం లేదు …

           శుభమస్తు

సమస్త లోకా సుఖినోభవంతు