TRINETHRAM NEWS

క్రీడాకారులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
దిండిగుళ్లపల్లి త్రినేత్రం న్యూస్
దిండి గుండ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రజా పాలన విజయ ఉత్సవంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో ముఖ్య అతిథులుగా హాజరై సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన గౌరవ దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు
గెలిచినవారు గెలుపు నిలుపుకోవాలని ఓడిన వారు గెలుపు కోసం పోరాడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్ రెడ్డి సిపిఐ నాయకులు బొడ్డుపల్లి వెంకటరమణ శైలేష్. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయి ఎంపీడీవో వెంకన్న తాసిల్దార్ ఆంజనేయులు రేఖ నాయక్ లక్పతి నాయక్ లోక్య నాయక్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ వెన్నెల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉమర్ వేణు గోపాల్ . వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ గ్రామాల పి ఈ టి లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App