TRINETHRAM NEWS

ఖనిలో కన్నుల పండుగగా స్పోర్ట్స్ డే వేడుకలు…

అంబరాన్నంటిన ఆపిల్ కిడ్స్ క్రీడా వేడుకలు..!

పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు ఏంతో ముఖ్యమని, చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవాటు చేయడం మరింత ముఖ్యమని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని జవహర్ లాల్ స్టేడియంలో శుక్రవారం ఆపిల్ కిడ్స్ స్కూల్ ఆన్యువల్ స్పోర్ట్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఆపిల్ కిడ్స్ స్కూల్ ఫౌండర్ & ప్రిన్సిపాల్ గాలి సునీత రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా విద్యాధికారి మాధవి, సింగరేణి ఆర్జీ-1 ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్ హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, పిల్లలకు ఆటల ద్వారా శారీరకంగా ఎదిగి ఆరోగ్యంగా ఉండడమే కాక మానసిక వికాసం కలుగుతుందని, దాని ద్వారా చదువులో రాణిస్తూ, అన్ని ఈవెంట్స్ లో నైపుణ్యం చూపిస్తారని అన్నారు.

గెలుపు ఓటములు ప్రక్కన పెట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఆటల్లో పాల్గొనేట్లు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడాజ్యోతిని అతిథులు వెలిగించారు. వివిధ క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ అతిధులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దల్లి తేజస్విని ప్రకాష్ బాలరాజ్ కుమార్ లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, కే రాజేందర్, బంక రామస్వామి, తిలక్ చక్రవర్తి, ట్రస్మ నాయకులు సమ్మారావు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అంజారెడ్డి, తిరుపతి రెడ్డిలతో పాటు మగువ సభ్యులు డాక్టర్ లక్ష్మీవాణి, స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఫర్జానా, ఇంచార్జ్ లు అరుణ, సుష్మిత తోపాటు ఉపాధ్యాయినులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App