
పెద్దపల్లి, మార్చి-24//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు ఆవిష్కరిత ఎర్రం మల్లారెడ్డిని కలిశారు పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన ఎర్రం మల్లారెడ్డి డ్రం సీడర్ పద్ధతితో విత్తనాలు జల్లడం, ఇతర ఆధునిక పద్ధతులను పాటించి అత్యధికంగా వారి దిగుబడులు సాధించిన నేపథ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ ఇన్నోవేటర్ ఫార్మర్ గా ఎంపిక చేసి అవార్డు అందించడం జరిగింది
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంబంధిత రైతును అభినందించి, ఆధునిక పద్ధతులను ఇతర రైతుల కూడా పాటించి అధిక దిగబడులు సాధించాలని అదనపు కలెక్టర్ సూచించారు
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, సంబంధిత రైతు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
