Trinethram News : జగిత్యాల జిల్లా మార్చి08
మహాశివరాత్రి రోజు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈరోజు వింత ఘటన జరిగింది.
పూజామందిరంలోకి ఊర పిచ్చుక వచ్చింది. పూజ మందిరంలో చాలా సమయం కదలకుండ శివధ్యానంలో ఉన్నట్లు పిచ్చుక కూర్చుకుంది.
మానవులే కాదు పశువులు పక్షులు కూడ ముక్తి మార్గం కోసం శివారాధన చేస్తా యనే భావన కల్గుతుంది.
ఊర పిచ్చుకలు ఇంటిలోకి వస్తేనే అదృష్టంగా భావి స్తారు. ఏకంగా పూజా గదిలోకి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు ఈ ఇంటి కుటుంబ సభ్యులు.