
Trinethram News : వాషింగ్టన్ : ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ 8 ప్రయోగించిన కొంత సమాయానికే పేలిపోయింది. గురువారం నాడు స్టార్‌షిప్ 8 బహామాస్ మీదుగా పేలిపోయింది.
ఫిబ్రవరి 6న స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ కొన్ని నిమిషాలకే నియంత్రణ కోల్పోయింది. దక్షిణ ఫ్లోరిడా, బహమాస్ సమీపంలో స్టార్ షిప్ పేలిపోయి, శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత కరేబియన్ ప్రాంతంలో పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఫ్లైట్ రాడార్ 24 రిపోర్ట్ చేసింది.
టెక్సాన్ నుంచి స్పేస్‌ఎక్స్ అంతరిక్ష ప్రయోగ సంస్థ స్టార్ షిప్ ను గురువారం ప్రయోగించింది. కొన్ని నిమిషాలకే స్టార్ షిప్ అంతరిక్స నౌక నియంత్రణ కోల్పోయి పేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రయోగించిన కొంత సమయం తర్వాత స్టార్ షిప్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదని అధికారులు తెలిపారు. అంతలోనే స్టార్ షిప్ పేలిపోయినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహమాస్, ఫ్లోరిడా ప్రాంతాలలో ఆకాశం నుంచి తారాజువ్వలు పడుతున్నట్లు స్థానికులకు కనువిందు చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
