
Trinethram News : వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. నేడు జిల్లా ఎస్‌పి కె.నారాయణ రెడ్డి , IPS జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో ఎస్‌పి మొదటగా జిల్లా నందు నమోదు అయిన కేసుల యొక్క వివరాలు అడిగి తెల్సుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో ఎస్‌పి మాట్లాడుతూ ఎలాంటి ఫైల్ లు పెండింగ్ లో ఉంచవద్దు, ఎప్పటికప్పుడే అప్డేట్ చేసుకోవాలని అదేవిధంగా ఆన్లైన్ నందు కూడా ఎలాంటి ఫైల్స్ పెండింగ్ లో పెట్టవద్దు, ప్రతి యొక్క పోలీస్ అధికారి Functional vertical ల పైన ప్రత్యేక దృష్టి కేటాయించాలని యూఐ కేసులు,NBWS, పాత పెండింగ్ కేసులు,POCSO కేసులు,SC ST కేసులు మరియు NDPS ఆక్ట్ కేసుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, కోర్ట్ డ్యూటి ఆఫీసర్స్ తో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం లో ఉండి కేసులలో కన్వెక్షన్ శాతాన్ని పెంచాలని జిల్లా ఎస్‌పి తెలిపినారు.
పోలీస్ అధికారులు ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ సిబ్బంది తో సమావేశాలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకొని అందరూ పోలీస్ సిబ్బందితో పోలీస్ అధికారులు మాట్లాడాలి పోలీస్ అధికారులందరు రోడ్డు ఆక్సిడెంట్ లు, ఆత్మహత్యలు జరుగుటకు కారణాలు తెలుసుకొని వాటిని తగ్గించాలని ప్రజలలో సిసిటివి ల పైన అవగాహన కల్పించాలని,పోలీస్ అధికారులు ప్రజలతో మమేకం అయి పని చేయాలని, డైల్ 100 కాల్స్ పైన నిర్లక్ష్యం చేయవద్దు అని,చోరీ కేసులపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని,దొంగతనాలపైన ప్రజలలో అవగాహన కల్పించాలని ఎస్పీ తెలిపినారు.
ఇట్టి కార్యక్రమం లో అదనపు ఎస్‌పి టివి హనుమంత్ రావు, తాండూర్, పరిగి ,వికారాబాద్,డిసిఆర్‌బి డిఎస్‌పి మరియు ఏఆర్ డిఎస్‌పి గార్లు, జిల్లా ఇన్స్పెక్టర్ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
ఇట్లు
పిఆర్‌ఓ,
డిపిఓ,వికారాబాద్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
