TRINETHRAM NEWS

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:15.2.2024

దేవరపల్లి, జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్ధి ఎం. సాయిరాం కృష్ణ ఎమర్జెన్సీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ యాప్ ద్వారా దగ్గిరలోని పోలీసు స్టేషన్ కు, పంచాయతీ ఆఫీస్ కి అలారం ద్వారా హెచ్చరికలు పంపడం జరుగుతుందనీ అన్నారు. మహిళలూ గానీ, ఎవరైనా కానీ వేధింపులకు గురి అయితే వారీ వద్ద వున్న ఫోన్ లో ఎమర్జిన్సి లొకేషన్ ఐడెంటిఫికేషన్ సాప్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకుని సందేశం పంప వచ్చునని అన్నారు. జీపీఎస్ ట్రాక్ తో అనుసంధానం చేయడం వల్ల మనం ఎక్కడ ఉన్నామో తేలిగ్గా తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు.

పేరా రామచంద్రపురం, అనపర్తి మండలం, సిద్ధ బత్తుల మధుబాల వ్యవసాయ రంగం లో ఉపయోగ పడే టూ స్ట్రోక్ పవర్ స్ప్రేయర్స్ ద్వారా పంట కు నష్టం వాటిల్లకుండా సపోర్టింగ్ కర్రలు ఉపయోగించి ఎరువులు పురుగు మందులు వేసుకోవాలో  తెలియ చేసే ప్రాజెక్ట్ అన్నారు.  వీటి వల్ల పంటపొలాల్లో మందులు వేళకు వెయ్యడం, బ్యాక్ పెయిన్ రాకుండా రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని పేర్కొన్నారు. సాధారణ స్ప్రేయర్స్ వల్ల వొచ్చే ఇబ్బందులకు వీటితో చెక్ పెట్టవచ్చు అని తెలియ చేశారు.

మల్లవరం, గోకవరం మండలం జెడ్పీ హై స్కూలు కి చెందిన కె.పాలినా మాట్లాడుతూ , నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కుంటున్న సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు.. వాటికి చెక్ పెట్టే దిశగా బయో ప్లాస్టిక్ తయారు చేసే విధానం గురించి వివరించారు. కర్ర పెండలం ద్వారా ఏవిధంగా తయారు చేస్తారో తెలియ పరిచారు. కర్ర పెండలం పిండి, గ్లిజరిన్, వెనిగర్, ఫుడ్ కలర్ ఉపయోగించు కోవచ్చు నని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కి మెంటర్ గా ఉపాధ్యాయురాలు కే. ఝాన్సి వ్యవహరించారు.

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.