TRINETHRAM NEWS

ఫిబ్రవరి 1 వ తేదీన సజావుగా పెన్షన్ పంపిణీ

ఉదయం 11 గంటలకు 85 శాతం పూర్తి, 2,36,331 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.102 కోట్ల 14 లక్షల 40 వేలు మేర పంపిణి,

  • కలెక్టర్ పి ప్రశాంతి

Trinethram News : రాజమహేంద్రవరం రూరల్, జిల్లాలో సజావుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, మధ్యాహ్నం వరకు 90 శాతం మందికి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ అధికారులు అందచేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియచేసారు.

శనివారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం బొమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్ లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు పంపిణీ చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా lo 2,36,331 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.102 కోట్ల 14 లక్షల 40 వేలు మేర పంపిణి చెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యడం జరిగిందన్నారు.

జిల్లాలో మొత్తం 2,36,331 మందికి 17 కేటగిరిలలో రూ .102,14,40,000 సంబంధించిన మధ్యాహ్నం వరకు 2,12,647 మంది లబ్దిదారులకు పెన్షన్ పంపిణి చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, డిఆర్డిఏ పీడీ ఎన్ వి వి ఎస్ మూర్తి, రూరల్ స్పెషల్ ఆఫీసర్ కే ఎన్ జ్యోతి, ఎంపీడీవో డి శ్రీనివాస రావు లబ్ధిదారులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

pension