TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 3: అరకువేలి కేంద్రంగా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సివేరి దొన్ను దొర కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ముందుగా ఆర్యవైశ్యుల సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగార్చన అనంతరం భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొన్ను దొర మాట్లాడుతూ, వాసవి మాత ఆలయ నిర్మాణంలో తనను భాగస్వామ్యం చేసినందుకు గాను ఆర్యవైశ్యుల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. స్త్రీల ఆత్మ గౌరవాన్ని చాటిన కలియుగ పార్వతి దేవిగా వాసవి మాతను ఆయన అభివర్ణించారు.

అహింస, ఆత్మత్యాగానికి, శాంతికి ప్రతిరూపం వాసవి మాత అని కన్యకా పరమేశ్వరి అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ ఆశీస్సులు మెండుగా లభిస్తాయన్నది ఎప్పటినుంచో మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసమని అటువంటి దేవాలయం నిర్మాణంలో తన చేతుల మీదగా జరగడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జనవరి 31న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, నారా చంద్రబాబునాయుడు.

కూడా ఆర్యవైశ్యుల నిర్వహించిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవంలో కూడా పాల్గొని ఆ వాసవి మాత గొప్పతనాన్ని తెలియజేశారన్నారు. ఆర్యవైశ్యులకు ప్రభుత్వ ఏం మాదిరిగా అండగా ఉండబోతుందని విషయాన్ని కూడా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెదలబడు సర్పంచు పెట్టెలి దాసు బాబు,టిడిపి అరకువేలి మండల అధ్యక్షులు శెట్టి బాబురావు, ఎంపిటిసి భీమరాజు, పద్మాపురం మాజీ సర్పంచ్, ఆలయ నిర్మాణం కమిటీ చైర్మన్ రఘునాథ్, ఆర్యవైశ్యులు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App