TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 10
సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే మంటలు వ్యా పించాయి.ఒక్కసారిగా బోగిల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాం దోళనకు గురయ్యారు.

అప్రమత్తమైన లోకో పైలట్ రైలు నిలిపివేయగా.. ప్రయాణికులు కిందకు దిగిపోయారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది….