TRINETHRAM NEWS

కాంగ్రెస్ మంత్రులకు సవాలుగా మారనున్న సింగరేణి ఎన్నికలు

పెద్దపెల్లి జిల్లా: డిసెంబర్ 25
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వా నికి మొదటి నెలలోనే తొలి ఆగ్ని పరీక్ష ఎదురుకా బోతోంది.

ఈ నెల 27న జరిగే సింగ రేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌ టియుసి సంఘం గెలు పుకోసం పార్టీ కృషి చే స్తోంది.

గతంలో రెండు పర్యా యాలు విజయం సా ధించిన బిఆర్‌ఎస్ అను బంధ బొగ్గుగని కార్మిక సంఘం మరోసారి గెలిచి హ్యాట్రిక్ కోట్టేందుకు ఉవ్వి ళ్లూరుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఐ ఈ ఎన్నికల్లో వేర్వేరు గా పోటీ చేస్తూ కలబడటం ఆసక్తిని రేపుతోంది.

రాష్ట్రంలో కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 ఏరియాలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగ రేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులు న్నారు.

2017 అక్టోబర్ 5న సింగ రేణి గుర్తింపు సంఘం ఎన్ని కలు జరుగగా ఆ ఎన్నికల లో బిఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టిబిజి కెఎస్, గెలి చింది. అంతకు ముందు 2012లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే సంఘం గెలిచింది.

మరోసారి పాగా వేసేందుకు బిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం పోటీ పడుతుండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అను బంధ సంఘం ఐఎన్‌టి యుసి కూడా విజయ కేతనం ఎగుర వేసేందుకు ఊవ్విళ్లూరుతోంది.

సింగరేణి కార్మికుల్లో సిపిఐ అనుబంధ కార్మిక సం ఘం ఎఐటియుసికి గణనీయ మైనపట్టు ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పొత్తు పెట్టుకొని పనిచేయ డంతో పాటు పొత్తులో భాగంగా సిపిఐకి కేటా యించిన సింగరేణి హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెం స్దానంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలు పొందారు.

అయితే సింగరేణి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు వేర్వేరుగా పోటీలో నిల బడ్డాయి.కాగా,ఈ ఎన్నికల్లో పోటీకి దూరం గా ఉండాలని బిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం ముందు భావించి నప్పటికీ ఆ తరువాత కార్మిక సంఘ నేతల ఒత్తి డితో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో బిఆర్‌ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాం గ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొన సాగే అవకాశాలు కనిపి స్తున్నాయి.

సిఐటియు, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం పాకులా డుతున్నాయి.