TRINETHRAM NEWS

శ్రీ చైతన్య విద్యార్థులకు ఇంట్సో ప్రశంసా పత్రాల అందజేత

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన ఇంట్సో ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపిడ్ జాతీయ స్థాయి పరీక్షలో శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతీయస్థాయిలో విజయం సాధించడం ఆనందంగా ఉందని, ఇలాంటి లక్ష్యాలను మరెన్నో సాధించాలని, విజయాలకు శ్రీ చైతన్య పెట్టింది పేరని దిశా నిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులను అభినందిస్తూ, వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు మరియు పాఠశాల డీన్ శ్యాంసుందర్, ఇంచార్జ్ లు, గణిత, భౌతిక, రసాయన శాస్త్ర అధ్యాపక బృందం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App