
నరసరావుపేట డీఎస్పీగా విఎస్ఎన్ శర్మ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా. నగరంపాలెం పోలీసు స్టేషన్ విధులు నిర్వహిస్తూ నరసరావుపేట డీఎస్పీగా బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శాంతి భద్రతల విషయంలో రాజి లేకుండా పని చేస్తానన్నారు.అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేకాట,మట్కా, ఇసుక అక్రమ రవాణాపై రాజీ పడే ప్రసక్తి లేదని అన్నారు.
