TRINETHRAM NEWS

ISRO: సెంచరీ కొట్టనున్న షార్‌

Trinethram News : శ్రీహరికోట : Jan 22, 2025,

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) మరో అరుదైన మైలురాయికి సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడ వందో రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది. GSLV-F15 రాకెట్‌ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి చేర్చనుంది.
ఈ నెలాఖరులో ప్రయోగం ఉండొచ్చని భావిస్తున్నారు. షార్‌లో ఇది వందో ప్రయోగం కావడంతో ప్రధాని మోదీని ఇస్రో ఆహ్వానించింది. దీనికి ప్రధాని ఆమోదం తెలిపారని, కార్యక్రమం ఖరారు కావాల్సి ఉందని తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App