జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 22 at 14.03.21

TRINETHRAM NEWS

స్కౌట్స్ మరియు గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు

జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

పెద్దపల్లి, జనవరి -22: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి స్కౌట్స్ గైడ్స్ తృతీయ తోఫాన్ టెస్టింగ్ క్యాంప్ లో పాల్గొని ఉత్తీర్ణులైన స్కౌట్స్ మరియు గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రత్యేకంగా అభినందించారు.

బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఎంపికైన 65 మంది స్కౌట్స్ మరియు గైడ్స్ కు జిల్లా విద్యాశాఖ అధికారి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

హైదరాబాద్ లోని రాజ పురస్కార్ టెస్టింగ్ క్యాంపులో పాల్గొన్న స్కౌట్స్ మరియు గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ సూర్యదేవర జ్యోతి, జిల్లా స్కౌట్స్ మరియు గైడ్స్ కమిషనర్ జె రవీందర్, ఎల్.వి.లక్ష్మి స్కౌట్స గైడ్స్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page