ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

తేదీ : 19/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) సూచనల ప్రకారం స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ , త్రీ శా. దేవదత్ ఆధ్వర్యంలో ఈనెల ఇరవై వ తేదీన మీడియా మిత్రులకు ఆహ్వానం పలుకుతూ ఉదయం ఎనిమిది గంటలకు దేవదత్ కార్యాలయం నందు అన్నగారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎనిమిది గంటల ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటల కు ఫ్యాక్టరీ సెంటర్లోని అన్నగారి విగ్రహానికి పూలమాలవేసి సమర్పిస్తారు.
ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదు కేజీల భారీ కేక్ కటింగ్ జరుగుతుంది అది తెలిపారు. అదేవిధంగా సర్వమత ప్రార్థనలు ఉంటాయని, మెగా రక్తదాన శిబిరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుందని, మహా అన్నదానం ఉదయం పదకొండు గంటలకు జరుగుతుందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Seventy-fifth birthday celebrations.

You cannot copy content of this page