
Trinethram News : తెలంగాణ : ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్ రూహి మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే గురువారం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి….
