TRINETHRAM NEWS

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పిలిగుండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం స్వపరి పరిపాలన దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు ఎం.డి మోసిన్, ఉపాధ్యాయులు సుప్రియ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పంచలింగాల్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేశవులు, నర్సాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ రహీమ, పిల్లిగుండ్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రఫీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక పాత్రికేయుడు అరుణ్ రెడ్డి లు పాల్గొనడం జరిగింది. అంతేగాక ఈ మధ్యనే విడుదలైన జే.ఎల్ ఫలితాల్లో కేటగిరిలో 4 ర్యాంకు సాధించి జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించిన మోగులయ్య ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించడం జరిగింది. విద్యార్థులు ఎంఈఓ గా ప్రవీణ్, హెడ్మాస్టర్ గా గౌతం దేవ,వైస్ ప్రిన్సిపాల్ గా తరుణ్,ప్రవళిక, శివాని, శృతి, నిఖిత, , పీఈటీగా మణిక్రాంత్ పాల్గొని వారి వారి పాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఎండి. మోసిన్ మాట్లాడుతూ..దీనివల్ల నిజ జీవితంలో కూడా సమాజంలో ఏ విధంగా ఉండాలనే విషయంలో స్వీయ అనుభవం ద్వారా విద్యార్థులకు స్వయంగా తెలుస్తుందని తెలిపారు. సమాజంలో విద్యార్థులను, సమాజాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుని కృషి అనిర్వచనీయమైందని తెలిపారు.
అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ…ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు అన్నీ రంగాల్లో ముందుండటానికి ఉపయోగపడతాయని, ప్రతి రోజూ బ్లాక్ బోర్డు చాక్ పీస్ అని కాకుండా కొత్త విషయాలు నేర్చుకుంటారన్నారు. ఆహ్లాదకరమైన కార్యక్రమాల నిర్వహణ చేత విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తాయని తెలిపారు. పిల్లలు క్రమశిక్షణతో ఉండి మంచిగా చదువుకోవాలని పాఠశాలకు రెగ్యులర్ గా రావాలని, మీయొక్క ప్రగతే ఉపాధ్యాయులకు అత్యధికంగా సంతోషం కలిగించే విషయమని ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App