TRINETHRAM NEWS

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు.

సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు.

వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు.

శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

దరఖాస్తుదారులు ఒరిజినల్‌ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.