Secretariat, Hyderabad, Telangana State
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చొరవతో త్వరలోనే 35 కోట్ల రూపాయలతో రామగుండంలో బీసీ సంక్షేమ భవనం ఏర్పాటు బీసీ సంక్షేమ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్
రామగుండం నియోజకవర్గం , పారిశ్రామిక ప్రాంత అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిపేందుకై అహర్నిశలు పాటుపడుటున్న మాన్య రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
తేదీ:-11-6-2024 మంగళవారం రోజున సెక్రటేరియట్ హైదరాబాదులో కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆదాయంలో ప్రతి ఏటా లాభాలు అందించే గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ గతంలో నిర్మించినది కావడంతో బస్టాండు కూడా శిథిలావస్థకు చేరువ కావస్తున్న సందర్భంలో నేటి జనాభాకు అనుగుణంగా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకై గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ ని మోడల్ బస్టాండు వలె అధునీకరించాలని ప్రస్తుతం పెరిగిన ప్రయాణికుల రద్దీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతంగా ఉంటుందని అలాగే గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ నుండి గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని సర్వీసులను నడిపించాలని అలాగే మెట్రో నగరాలకు తదితర పట్టణాలకు ప్రధాన రూట్లలో మరిన్ని సర్వీసులను నడిపించినట్లయితే ప్రయాణికులకు సౌకర్యం వంతంగా ఉండటంతో పాటు ఆర్టీసీకి ఆదాయం వస్తుందని ఖాళీగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో ఆర్టీసీ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినట్లయితే నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల వలన కొంత ఆదాయం సమకూరుతుందని అలాగే రామగుండం నియోజకవర్గంలో బీసీ సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ కోరిన నేపథ్యంలో మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ ని మోడల్ బస్టాండు గా అధునీకరిస్తామని అలాగే ప్రధాన నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా సర్వీసులను పెంచుతామని అదే విధంగా ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని అదేవిధంగా 35 కోట్ల రూపాయలతో త్వరలోనే బీసీ సంక్షేమ భవనాన్ని నిర్మిస్తామని
ఈ సందర్భంగా మాట్లాడడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App