
Second Bus Service : కూకట్పల్లి జులై 18 (త్రినేత్రం న్యూస్) : బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సౌకర్యార్థం పటాన్‌చెరు నుంచి కూకట్‌పల్లి కోర్టు వరకు రెండో బస్సు సర్వీసును ప్రారంభించినట్లు బార్ అసోసియేషన్ ప్రకటించింది.ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు పటాన్‌చెరు నుంచి బయలుదేరే బస్సు ఆర్‌సీ పురం, బీరంగూడ ఆర్చ్, అశోక్‌నగర్, భెల్ జంక్షన్, చందానగర్, గంగారం, మదీనాగూడ, ఆల్విన్ ఎక్స్ రోడ్స్, మియాపూర్, హైడర్‌నగర్, జేఎన్‌టీయూ, లులు మాల్, నెక్సస్ మాల్, మలేషియన్ టౌన్‌షిప్, 9వ ఫేజ్ మీదుగా ప్రయాణించి ఉదయం 10:15 గంటలకు కూకట్‌పల్లి కోర్టుకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5:15 గంటలకు కూకట్‌పల్లి కోర్టు నుంచి బయలుదేరి అదే మార్గంలో ప్రయాణించి సాయంత్రం 6:15 గంటలకు పటాన్‌చెరు చేరుకుంటుంది.
ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరూ సద్వినియోగం చేసుకుని బస్సు సేవ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించాలని బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ఈ బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడానికి సహకరించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బార్ కౌన్సిల్ సభ్యుడు అశోక్ గౌడ్, గౌరవ న్యాయాధికారి మరియు టీజీఎస్‌ఆర్టీసీ అధికారులకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి. పి, ప్రధాన కార్యదర్శి కె. సురేందర్ గౌడ్‌తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe