
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్.టీ.పీ.సీ టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య పాఠశాలలో సైన్సు దినోత్సవo మరియు ఫ్యామిలీ బ్లూమ్ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. -ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎన్ టి పి సి హెడ్ ఆఫ్ హెచ్ఆర్ శ్రీ బిజాయ్ కుమార్ సిక్ధర్ మరియు హెచ్ఆర్ కెవిఎంకె శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిధులు కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థుల్లో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయని ఉపాధ్యాయులు వారిలో దాగి ఉన్న మేధస్సును, సృజనాత్మకతను వెలికితీసే విధంగా వారి ప్రతిభను గుర్తించి భవిష్యత్తుకు బంగారుబాట వేయాలని చెప్పారు.
తదుపరి విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన ఫ్యామిలీ బ్లూమ్ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాద పూజా చేసి వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమo పట్ల తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ నమ్రత, డీన్ అనిల్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్, అధ్యాపకబృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
