
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. మా సమస్య ప్రభుత్వ అధికారులకు పట్టదా? డిండి మండల పరిధిలోని తవకలాపూర్ గ్రామంలో పెద్దమ్మ కాలనీలో 50 ఇండ్లకు మంచినీరు లేక నెల రోజులు కావస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు.
గ్రామ పంచాయతీ తీసుకుపోయిన నేనేం చేయాలి? మోటర్ బాగు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అని అన్నారు.
ఈ విషయాన్ని ఎండిఓ దృష్టికి తీసుకుని పోతే వారు పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడతా అని అన్నారు. మూడు రోజులు గడుస్తున్న ఇంతవరకు మంచినీరు లేక ఇబ్బందులకు గురవుతున్నాము.
ఫిల్టర్ వాటర్ ఎంత కని కొనాలి. మా సమస్య ప్రభుత్వ అధికారులకు పట్టదా? మా సమస్యను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలియజేస్తామని, అదేవిధంగా ఓట్లు అడగడానికి ఎవరు వస్తారు, చూస్తామని, ఓట్లు మాత్రం కావాలి ప్రజల సమస్యలు వారికి పట్టవా అని వారు అనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కొప్పుల సైదమ్మ, కడారి రేణమ్మ, దండేడ్ కార్ లక్ష్మీబాయి, మదన మొని హరిత, ఎండి, సప్పియ, కడారి వెంకటమ్మ, ఎండి, మై మూద, ఎండి, జానీ, ఎల్లికంటి అనూష,, రాపోలు యశోద, సంపంగి బాలమ్మ, నల్లవెల్లి సులోచన తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
