TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ప్రజలు ఇటీవల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడటంపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే, నల్లమిల్లి,

ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ….

అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఇటీవల దాదాపుగా 200 మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడటం చాలా ఆందోళనకరమైన విషయం,

ఏ ప్రాంతంలోను లేని విధంగా ఒకే గ్రామంలో రెండు నుండి మూడొందల మంది క్యాన్సర్ బారిన పడి ఇప్పటికి 30 మంది మరణించడం జరిగింది,

దీనికి కారణం అంతుబట్టని పరిస్దితి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహనరెడ్డి, ప్రత్యేక శ్రద్దతో అప్పటి ఎమ్మెల్యే, అవినీతితో నెలకొల్పిన గ్రాసిం ఇండస్ట్రీ అనే ఒక కెమికల్ ఇండస్ట్రీ వలననే అని ఆ గ్రామస్దులు అభిప్రాయపడుతున్నారు

సల్ఫ్యూరిక్ యాసిడ్, కాస్టిక్ సోడాలాంటి దాదాపు 56 రకాల కెమికల్స్ ఆ పరిశ్రమ నుండి ఉత్పత్తి కావడం దానివలనే ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు

ప్యాక్టరీకి సంబంధించిన ముడిసరుకు , ఉత్పత్తుల రవాణా నిమిత్తం వందలాది వాహనాలు గ్రామంలో ప్రయాణించడం వలన వాయు కాలుష్యం, శబ్దకాలుష్యం వస్తుంది అంతేకాక ప్యాక్టరీ వలన జలకాలుష్యం కూడా జరుగుతుందని అందరూ భావిస్తున్నారు,

అనేకసార్లు కోరినప్పటికీ పర్యావరణ శాఖ ఏ విధమైన శ్రద్ద అక్కడ చూపించడం లేదు,

ఇంతమంది క్యాన్సర్ బారిన పడినందున ప్రభుత్వం శ్రద్ద తీసుకుని అక్కడ ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి దీనికి కారణాలను తెలుసుకోవలసిన అవసరం ఉందని కోరుచున్నాను,

ప్రత్యేకంగా పర్యావరణశాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ఈ విషయంపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని సభ ద్వారా కోరుకుంటున్నాను.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Save Balabhadrapuram village