
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జి. మాడుగుల ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, జి. మాడుగుల మండలం,సోలభం పంచాయతీ కేంద్రంలో, చెరువులు ప్రారంభించిన గ్రామపంచాయతీ సర్పంచ్, ఐసారం హనుమంతరావు. 60 చెరువులకు కోటి రూపాయలు నిధులు మంజూరు.
సోలభం గ్రామపంచాయతీ కేంద్రంలో శనివారం చెరువు ప్రారంభించిన, సోలభం పంచాయతీ సర్పంచ్ ఐసారం హనుమంతరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయి. ఇందులో పంచాయతీ మొత్తం 60 చెరువులు మంజూరయ్యాయని, ఒక్కొక్క చెరువుకు రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయని, అలాగే గ్రామపంచాయతీ మొత్తం 60 చెరువులకు సుమారు కోటి రూపాయలు మంజూరైనట్టు స్థానిక సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐసారం మచ్చలింగం , భీమశంకర్, టెక్నికల్ అసిస్టెంట్, వరప్రసాద్ ఎల్ .రామకృష్ణ స్థానిక గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
