Trinethram News : తమిళనాడు:జనవరి15
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు.
తమిళనాడు రాజధిని చెన్నైలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుల్లో పాల్గొన్న తమిళిసై.. తన భర్తతో కలిసి కట్టెల పొయ్యిపై పాయసం వండారు.
ప్రత్యేకంగా అలంకరించిన కుండలో బియ్యం, బెల్లం వేసి పాయసాన్ని కలియ బెట్టారు. అనంతరం అక్కడున్నవారికి దానిని వడ్డించారు.