ఎండపల్లిలో ఆహ్లాద భరితంగా సంక్రాంతి సంబరాలు
అరకులోయ: జనవరి16. త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్.!
అరకువేలి మండలం. పద్మాపురం గ్రామపంచాయతీ. ఎండపల్లి వలస గ్రామంలో మకర సంక్రాంతి పండగను పురస్కరించుకొని, పీసా కమిటీ ఉపాధ్యక్షులు కిల్లో మహేష్ ,ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది.యువా నాయకుడు మహేష్ మాట్లాడుతు “మధుర సంగీతం, మగువల నృత్యం, పచ్చని పైరు అందం, బలపాడు బంధం ,మరచిపోనిది జ్ఞాపకం,మరుపరనిది సంక్రాంతి పర్వదినం, ఆని గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో దింసా పోటీలు, ముగ్గుల పోటీలు. విద్యార్థులకు, పిల్లలకు ఆటల పోటీలు, నిర్వహించడం జరిగింది. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు, పంచాయతీ వైస్ సర్పంచ్ జె. భగత్, ఎండపల్లి వలస క్లస్టర్ పిసా కమిటీ కార్యదర్శి కిల్లో సీతారాం . వార్డు సభ్యులు,కార్మిక సంఘం నాయకుడు శీలం కొండలరావు . పొట్టంగి సింహాద్రి .కిల్లో మొగిలి . మాజీ వార్డు సభ్యులు అప్పలకొండ.
రాజేశ్వరి .జి. గుండు,బుద్దు. మంగరాజు,రాజని అప్పారావు. గ్రామ యువత .పార్వతి. చిన్న .ఆది .గోపి. అప్పలరాజు.భార్గవ్. ఉమామహేశ్వరి.రత్న. చాందిని . గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App