TRINETHRAM NEWS

ప్రభుత్వ న్యాయవాది శంతన్ కుమార్ కు ఆత్మీయ సత్కారం.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని మార్కండేయ కాలనీ ప్రాంతానికి చెందిన, వెలుగు సామాజిక స్వచ్చంద సంస్థ లీగల్ అడ్వైజర్ సీనియర్ న్యాయవాది భాగవతుల శంతన్ కుమార్ ను, ప్రభుత్వ న్యాయవాదిగా
నియమితులైన సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్. సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో శంతనన్ కుమార్ కు, సంస్థ అధ్యక్షులు పెద్దంపేట్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎలిని కిషన్ రావు సలహాదారులు కె. రాజేందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేముల రమేష్ ఆత్మీయ సత్కారం నిర్వహించి జ్ఞాపికను అందించారు. అనంతరం వారు మాట్లాడారు. వెలుగు సామాజిక స్వచ్ఛ సంస్థ లీగల్ అడ్వైజర్ శంతనన్ కుమార్ ప్రభుత్వం న్యాయవాదిగా నియమితులు కావడం ఆనందంగా ఉందన్నారు. తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలలో న్యాయవ్యవస్థ తోడైంది అని. నిరుపేదలకు ఏదైనా సమస్య వస్తే వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వ పక్షాన మాట్లాడే వ్యక్తి తమ సంస్థ లీగల్ అడ్వైజర్ ఉండడం సంతోషంగా ఉంది అన్నారు.గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ స్థానం,లేబర్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కోర్ట్ కు అదనపు గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించడం జరిగిందని.
.ఈయన న్యాయ స్థానం పరిధిలోని ప్రభుత్వం తరపున కేసులను వాదించనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగునూరి రవి కూమార్,బేజుగాం సతీష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App