
Rythu Nestham : డిండి ,అక్టోబర్ 27, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కార్యక్రమం వీక్షించారు.వీడియో కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ఐఏఎస్ , వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఐఏఎస్ రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి దేవరకొండ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీలక్ష్మి హాజరై రైతులకు ఎలినినో ప్రభావం పట్ల జాగ్రత్త వహించాలని ,ఎట్టి పరిస్థితుల్లోనూ యాసింగిలో వరి సాగు చేయవద్దని, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో సాగు చేసుకోగల చిరుధాన్యాలు నువ్వులు, కుసుమలు, జొన్నలు ఆముదాలు, పెసర్లు , వేరుశనగ వంటి పంటలను సాగు చేయాలని శ్రీ లక్ష్మీ రైతులకు సూచించారు.
డిండి మండల వ్యవసాయ అధికారి రెహనా మాట్లాడుతూ , ఎల్ ని నో దృష్ట్యా రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, బోర్లలో నీళ్లు ఉన్నప్పటికీ వరి సాగు చేయవద్దని, ఆరు తడి పంటలను వేసుకొని రైతులు ఎల్ ని నో ప్రభావం నుండి బయటపడాలని ఆమె సూచించారు. అనంతరం రైతులకు సబ్సిడీపై వేరుశనగ ,పెసర విత్తనాలను ఏ డి ఏ శ్రీలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు అంజలి ,అపర్ణ, విజయ, సాయి తేజ, ఎఫ్ పి ఓ, సి ఈ ఓ సూర్య ప్రకాష్ ,ఏపిఎం విజయ్ కుమార్, సీసీ లక్ష్మయ్య, సీఈఓ బాల్రెడ్డి, సర్పంచులు రామావత్ కిషన్ నాయక్ (జేత్య తండా )తేజు నాయక్ (కాలియా తండా) వెంకట్రాం( కుందేలువాయి తండా )మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe