TRINETHRAM NEWS

తిరుపతి :

ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుపతి- కడప- తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తోంది.

ఈ క్రమంలో ఈ బస్సును ఆపి అధికారులు తనిఖీ చేశారు.

ఈ నెల 17న కడప జిల్లా కుక్కలదొడ్డి దగ్గర తనిఖీ చేశారు. ప్రయాణికుల టిక్కెట్లపై అనుమానం వచ్చి, టిమ్ ను తనిఖీ చేయగా, అసలు విషయం బయటపడింది.

టిమ్స్ వినియోగించే పేపర్ రోల్పై డీటీపీ ద్వారా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ముద్రించిన నకిలీ టిక్కెట్లను ప్రయాణికులకు అందిస్తూ తనిఖీ అధికారులకు పట్టుబడ్డాడు.

రైల్వే కోడూరు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు.