
Trinethram News : హరియాణాలోని శిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 8న తొలిసారి ఈడీ సమన్లు పంపించింది. అయితే వాటిని రాబర్ట్ పట్టించుకోలేదు. ఈక్రమంలోనే మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేస్తూ… తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
దీనితో రాబర్ట్ వాద్రా మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ విచారణ వెళ్ళుండగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పగానే మళ్లీ ఈడీ నోటీసులు పంపించారు.
ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే. నేను ప్రజల తరపున మాట్లాడి, వారి వాదనలు వినిపించినప్పుడల్లా, వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే నాకు 15 సార్లు సమన్లు పంపారు. ప్రతీసారీ 10 గంటలకు పైగా విచారించారు. నేను 23,000 పత్రాలను సమర్పించాను. ఈ కేసులో అన్ని వివరాలు అందించాను. అలాగే, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా… రాబర్ట్ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనంతరం ఈ భూమిని సదరు వాద్రా కంపెనీ… రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి రూ.58 కోట్లకు విక్రయించింది. దీనితో, వాద్రా కంపెనీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది.
ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏప్రిల్ ఎనిమిదో తేదీన మొదటిసారి జారీ చేసిన సమన్లకు వాద్రా స్పందించలేదు. విచారణకు కూడా వెళ్లలేదు. దీనితో, తాజాగా రెండోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
