రహదారి భద్రత మాసోత్సవాలు ఉత్సవాలు -2025 లో భాగంగా హెల్మెట్ అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహణ.
Trinethram News : రాజమహేంద్రవరం
జిల్లా పోలీసు వారు, జిల్లా రవాణా శాఖ వారు సంయుక్తంగా మహిళా అధికారులు, సిబ్బందితో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ. హెల్మెట్ ధరించడం భారం కాదు, అది మనందరి బాధ్యత. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో అవగాహన ర్యాలీ, మానవహారం
బండి నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి, వారి గమ్యాలకు సురక్షితంగా చేరుకోవాలి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి అవగాహన కల్పించాలి. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.బి. ఎం మురళీకృష్ణ జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు వారు మరియు జిల్లా రవాణా శాఖ వారు సంయుక్తంగా ఆధ్వర్యంలో సుమారు 200 మంది జిల్లా మహిళా పోలీస్ అధికారులు, జిల్లా రవాణా శాఖ మహిళా అధికారులు, సిబ్బంది, మహిళా రక్షక్ టీంలు, డబ్ల్యూ ఎం ఎస్ కే, జి.ఎం.ఎస్.కే లతో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.బి. ఎం మురళీకృష్ణ , డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్. సురేష్ వారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జె.ఎన్. రోడ్, రామాలయం సెంటర్, ముగ్గు పేట సెంటర్, ఆజాద్ చౌక్, దేవి చౌక్, కంబాలచెరువు మీదగా చిరంజీవి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం చిరంజీవి బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించినారు. మరల అక్కడ నుంచి బయలుదేరి హైటెక్ బస్టాండ్, వై జంక్షన్, సెంట్రల్ జైల్ రోడ్డు, లాలాచెరువు మీదగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) మురళీ కృష్ణ మాట్లాడుతూ…హెల్మెట్ ధరించడం భారం కాదని, అది మనందరి బాధ్యత అన్నారు. బండి నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని, విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు.
జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ మహిళా ద్విచక్ర వాహన చోదకులతో ప్రత్యేకంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఇందుకు సంబంధించి సహాయ సహకారాలు అందించిన ఎస్పీ నరసింహ కిషోర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యత కలిగిన మహిళలు హెల్మెట్ ధరించాలని పిలుపు ఇవ్వడం, బైక్ ర్యాలీ లో పాల్గొనడం సమాజానికి ఎంతో స్ఫూర్తిని కలిగించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి( ఎస్ బి) బి. రామకృష్ణ , మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి, హెచ్, సంపత్ కుమార్, ఎమ్, రవికుమార్, జి. రాంనారాయన్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె. చైతన్య సుమా , పి. వి. వి. సాయి కుమార్, ఇన్స్పెక్టర్ (ఎస్ బి) ఏ. శ్రీనివాసరావు , ఇన్స్పెక్టర్ ట్రాఫిక్-1 నబి,ఇన్స్పెక్టర్ ట్రాఫిక్-2 సిహెచ్. సూరిబాబు , ఇన్స్పెక్టర్( మహిళా పిఎస్) కే. మంగాదేవి ఇతర ఆర్టీవో అధికారులు, ఇతర అధికారులు మరియు మహిళా రైడర్స్, సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App