WhatsApp Image 2025 01 30 at 19.54.05
శుభకార్యములో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్: జనవరి 30: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా :కావలి
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి పట్టణం 23వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గోసు రవి కుమార్తె శిరీష వివాహ నలుగు కార్యక్రమం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. అలాగే 23వ వార్డుకు చెందిన సోమిశెట్టి బ్రహ్మయ్య అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఇంటి వద్ద తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి నివాసానికి చేరుకొని అతడిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని అతనికి భరోసా కల్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
